- Log in to post comments
నేడు జగమంతా ఒక కుగ్రామం
సమాచారమంతా హస్త దర్శనం
ఆధిపత్యం కొందరి సొత్తంటూ
ఆర్జనయే తమ దృక్పధమంటూ
పదమంటూ తమ పధములో
పధికులుగ పరుగులు పెట్టిస్తుంటే
పడమంటూ ప్రలోభాల వలలో మేమంటూ
పడనీయం రేపటి నిపులమంటూ
అనుచితం కాని నైపుణ్యాలను
ఉచితంగా అందరికి పంచుతూ
నవసమాజ నిర్మాణంను మీ భుజ స్కందాలమీద మోస్తున్న
స్వేచ్ఛ పధికులారా!
విజ్ఞాన వీచుకలు బడుగు వారి స్వేచ్ఛ తీర్చే వరకు
కాపీ హక్కుల సంకెళ్ళు తెగిపోయె వరకు
పదండి ముందుకూ
పదండి నడుపుతూ......
అభినందలతో
ఓ ఉపధ్యాయ