గ్ను జీ.పి.ఎల్.

ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాము. ఫ్రీ సాఫ్ట్‌వేర్ వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. దీని వాడకం వల్ల మనకు ఇతర సాఫ్ట్‌వేర్‌లో లేని ఎన్నొ హక్కులు మనకు వస్తాయి. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ప్రాదాన్యంగా గ్ను జి.పి.ఎల్. అనే లైసెంస్‌ నిబంధనల ప్రకారం లభిసుంది. గ్ను జి.పి.ఎల్. మనకు ఇచే హక్కులను తెలుకోవటం లాభదాయకంగా వుంటుంది. ఉదాహరణకు మీరు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఎవరికైనా చట్టబద్దంగా కాపీలు చేసి అమ్మవచ్చు. పైగా మీ సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌గా విడుదల చెయాలని నిర్ణయించినప్పుడు గ్ను జి.పి.ఎల్.ను సులభంగా వాడుకోవచ్చు. మీరు గ్ను జి.పి.ఎల్. సాఫ్ట్‌వేర్‌ను వాడినప్పుడు, ఇతరులకు పంచినప్పుడు, దీనిని ఆధారంగా చేసుకొని మీరుక సాఫ్ట్‌వేర్ తయారు చేసినప్పుడు కొన్ని నిబంధనలకు కట్టుబడి వండాలి.

ఒక సాఫ్ట్‌వేర్ సృష్టికర్త మనకు తను తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను అమ్మినప్పుడు కానీ, ఉచితంగా ఇచ్చినప్పుడు కానీ ఆ సాఫ్ట్‌వేర్ యెక్క వాడకం‌ ఒక ఒప్పందానికి లొబడి ఉంటుంది. దీనినే లైసెన్స్ అంటారు. సాఫ్ట్‌వేర్‌ను ఎటువంటి ఉపయోగాలకు వడవచ్చు? ఇతరులకు కాపీలు తయారు చేసి ఇవ్వవచ్చా లేదా? సాఫ్ట్‌వేర్ను మార్చటానికి హక్కులు వున్నయ్యా లేదా? ఇటు వంటి విషయాలు విష్లేషిస్తుంది. గ్ను జనరల్ పబ్లిక్ లైసెన్స్ (గ్ను జి.పి.ఎల్.) కూడా ఒక సాఫ్ట్‌వేర్ లైసెన్స్. దినిని ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు రూపొందించారు. దిని రెండవ సంచికను 1991లో విడుదల చేసారు. ఇదే ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో వుంది.

ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారి సిద్ద్హాంతాలను అమలు చేయటానికి వారు గ్ను జనరల్ పబ్లిక్ లైసెన్స్‌ను రూపొందించారు. ఒక సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్ అని అనాలంటే దానికి కొన్ని గుణాలుండాలి.

  1. వినియోగదారులు ఆ సాఫ్ట్‌వేర్ను ఎటువంటి పనికైనా వాడవచ్చు
  2. ఆ సాఫ్ట్‌వేర్‌లొ ఎటువంటి మార్పు లైనా చేయవచ్చు (దీనికి సోర్స్ కోడ్ అవసరం)
  3. ఇతరులకు కాపీలు చేసి పంచవచ్చు
  4. ఆ సాఫ్ట్‌వేర్‌లొ మర్పులు చేసి, ఆ మార్పులను ఇతరులకు కాపీలు చేసి పంచవచ్చు‌.

వినియోగదారులకు ఈ హక్కులన్నింటినీ ఒక సాఫ్ట్‌వేర్ అందచేసినప్పుడు దానిని ఫ్రీ సాఫ్ట్‌వేర్ అనవచ్చు. దీనికి అనుగుణంగా గ్ను జీ.పీ.ఎల్. లోని వాక్యాలు రచించబడ్డాయి. కాబట్టి గ్ను జి.పి.ఎల్. నిబంధనల ప్రకారం మీకు లభించిన సాఫ్ట్‌వేర్‌ను మీరు ఎటువంటి పనికైనా వాడవచ్చు, ఎటువంటి మార్పులనైనా చేయవచ్చు, లేదా ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఇవన్నీ చేయటానికి కాను మీకు సోర్స్‌కోడ్ కావసి వుంటుంది. మీకు ఈ సోర్స్‌కోడ్‌ను అందించవలసిన భాద్యత మికు సాఫ్ట్‌వేర్ ఇచ్చనవారిపై వుంటుంది. అలాగే మీరు అదే సాఫ్ట్‌వేర్‌ను ఇతరులకు పంచినప్పుడు, వారికి కూడా మీరు సోర్స్‌కోడ్ ఇవ్వవలసిన అవసరం వుంటుంది. మీరు కనుక ఏమైనా మార్పులు చేస్తే ఆ మార్పులను కూడా గ్ను జి.పి.ఎల్. నిబంధనల ప్రకారం ఇతరులకు ఇవ్వాల్సివుంటుంది.

మీరు తయారుచెసిన సాఫ్ట్‌వేర్‌పై కాపీ హక్కులు తీసుకోవటం ఎలా? ఆపై దానిని గ్ను జి.పీ.ఎల్. లైసెన్స్ నిబంధనల ప్రకారం ఇతరులకు అమ్మటం లేదా ఉచితంగా ఇవ్వటం ఎలా? - ఇది చాలా సులువైన పని. మీరు తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌పై మీకు ప్రచురణ హక్కులు వున్నట్లే. దినికై ఎవరినీ మీరు సంప్రదించనక్కర్లేదు. ఎక్కడా మీరు దాకలు చేయనక్కర్లేదు. మీరు ఆ ప్రచురణ హక్కులను ఎవరికైనా బదిలీ చేసేవరకు ఆ హక్కులు మీకే వుంటాయి. ఒక సాఫ్ట్‌వేర్ యొక్క ప్రచురణ హక్కులు మీ వద్ద వున్నాయంటే, దాని అర్ధం మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ను ఏ లైసిన్స్‌పైనైనా విడుదల చేయవచ్చు. ఒక లైసెన్స్ నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేయాలంటే, మీరు మీ సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు లైసెన్స్‌లోని నిబంధనలన్నిటితో కూడిన లైసెన్స్ పత్రాన్ని మీ సాఫ్ట్‌వేర్‌తో పాటూ ఇస్తే సరిపోతుంది. వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ను వాడేముందు లైసెన్స్‌లోని నిబంధనలను చదివి వారికి ఆ నిబంధనలు సమ్మతమైతేనే సాఫ్ట్‌వేర్‌ను వాడటం కొనసాగిస్తారు. ఆ నిబంధనలు వారు నిరాకరిస్తే వారు ఆ సాఫ్ట్‌వేర్ వాడటనికి అర్హులుకారు.

మీరు చేసిన మార్పులను కూడా గ్ను జి.పి.ఎల్. లైసెన్స్ నిబంధనలలోనే విడుదల చేయాలనేది ముఖ్యమైన నిబంధన. ఈ నిబంధనతోపాటు, పైన పేర్కొన్న విధంగా హక్కులను ఇచ్చే ఫ్రీ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌ను కాపీలెఫ్ట్ లైసెన్స్ అంటారు. ఈ నిబంధనలేకపోతే అందరూ, ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను వారి సాఫ్ట్‌వేర్‌లో వాడుకొని, లాభపడి, తిరిగి అందరికీ వారు చేసిన మార్పులను ఇవ్వరు. ఇలా జరిగుంటే ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఈనాడు, ఈస్థితికి వచ్చేదికాదు. కానీ ఈ నిబంధన లేని ఫ్రీ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు కూడా వున్నాయి. పైగా గ్ను లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్స్ (గ్ను ఎల్.జి.పి.ఎల్.) అనే లైసెన్స్ కూడా వుంది. దీనితో విడుదల చేసిన ఒక సాఫ్ట్‌వేర్‌ను వాడికొని ఇతరులు సొంతగా సాఫ్ట్‌వేర్ తయారుచేయవచ్చు. కానీ ఆ కొత్తగా చేసిన సాఫ్ట్‌వేర్‌ను మరి ఏ లైసె‌న్స్‌లోనైనా విడుదల చేయవచ్చు. గ్ను ఎల్.జి.పి.ఎల్. సాఫ్ట్‌వేర్‌కు చేసిన మార్పులను మాత్రము గ్ను ఎల్.జి.పి.ఎల్.లోనే విడుదల చెయ్యాలి.

గ్ను జి.పి.ఎల్. మూడవ సంచిక రానున్నది. దినికిగానూ అందరి వద్దనుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాతంగా అందరూ దిని రచనలో పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా నాల్గవ అంతర్జాతీయ సమావేశం బెంగుళూరులో 2006 అగష్టు 23-24 తేదీల్లో జరగనున్నది. కంప్యూటర్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా గ్ను జి.పి.ఎల్. మూడవ సంచికలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. పేటెంట్లకు వ్యతిరేకంగా, ఇతర లైసెన్స్‌లకు అనుకూలంగా, డీ.ఆర్.ఎం.కు వ్యతిరేకంగా, దుర్వినియోగాలను అరికట్టేలా దీనిలో మార్పులు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. దీనికై ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారి వెబ్ సైట్‌‌ను దర్శించండి.