Articles

నూరు శాతం పూర్తయిన గ్నోమ్‌ తెలుగీకరణ

Date

కంప్యూటర్ విజ్ఞాన సర్వస్వంలో తెలుగు మరో మైలు రాయిని దాటింది. కంప్యూటర్ని పూర్తిగా తెలుగులో వాడుకోవడానికి, నూరు శాతం తెలుగీకరణ పూర్తయింది. గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ సంస్థతో పాటు అనేక మంది వ్యక్తుల వ్యక్తిగత సహకారంతో చేసిన కృషి వలన, ఇప్పటి వరకు కంప్యూటర్లో చేయదగిన అన్ని పనులను ఇంగ్లీషు వంటి  ఇతర భాషలలోనే కాకుండా పూర్తిగా తెలుగులో నూ చేయవచ్చు.

     ప్రతి ఆపరేటింగ్ వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం)లోనూ వినియోగదారుడు (యూజర్) సాఫ్ట్వేర్లను, ఇతర సాఫ్ట్వేర్  పరికరాలను వాడుకోవడానికి గల యూజర్ ఇంటర్ఫేస్ ఇప్పటి వరకు ఇంగ్లీషు లోనే ఉంది. కాని ఇప్పుడు గ్నూ/లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలో గ్నోమ్‌ డెస్క్ టాప్ ఆవరణం ఇక నుండి  పూర్తిగా తెలుగులోనే వాడుకోవడానికి అనుగుణంగా అభివృధ్ధి చేయబడింది. గ్నూ/లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థ గ్నూ ప్రోజెక్ట్ లో భాగంగా ఉండటం మూలంగాను మరియు యూనీకోడ్ కు మద్దతు ఉండటం వలననే కంప్యూటర్ ను ఆయా స్థానిక భాషలలో మార్చుకోవడానికి మరియు వాడుకోవడానికి అనుకూలంగా ఉంది. సాధారణ కంప్యూటర్ వినియోగదారుల కోసం, విజ్ఞాన అభివృధ్ధి కోసం జి పి ఎల్ లైసెన్స్ తో గ్నూ ప్రోజెక్టు సహాయపడుతోంది. ఇందువల్ల ఎంతో వ్యయం ఆదా అవుతుంది. అదే ఇతర ప్రొప్రయిటరీ సాఫ్ట్వేర్ ల వలన లక్షల రూపాయల ధనం వెచ్చించాల్సి వస్తుంది.

JNTU – Microsoft A Memorandum of 'misunderstanding'

The Understanding:
Microsoft and JNTU Hyderabad have entered into an agreement to provide Microsoft developer tools 'free of cost' to students in colleges affiliated to JNTU Hyderabad. According to this article which appeared in “The Hindu” on October 27, the Microsoft Corporation will provide these tools under the DreamSpark programme of launched in November last year.
http://www.hindu.com/2009/10/27/stories/2009102759690400.htm
 
The misUnderstanding:
Though it might appear like a great deal, its actually not. Let us look at some aspects of this programme and 'understand' what lies beneath this misUnderstanding.

Petition to Cancel Proprietary Tender by NIC

Endorsed by
Individuals Organizations

We appeal to the community, organisations and individuals to sign the following petition to cancel the proprietary tender issued by the NIC for procuring laptops for the Supreme Court of India.

Organisations can add their name in the wiki page provided and individuals can sign the petition. All the respective organisations are requested to host the petition and gather the signatures of members associated with them. Swecha would gladly provide the space for petitions of the respective organisations.

The tender is availabe at http://tenders.gov.in/

వర్డ్ డాక్యూమెంట్లను వాడకండి

ఆఫీస్ అవసరాలకు వాడే సాఫ్ట్వేర్ని ఆఫీస్ సూట్ అంటారు. ఒక సాదారణ ఆఫిస్ సూట్లొ వ్యాసాలు రాయవచ్చు, ప్రసెంటేషన్లు ఇవ్వవచ్చు, కంపెనీ ఖతాలు దాచటం వంటి పనులతొ పాటూ మరెన్నో పనులు కూడా చెయ్యవచ్చు. అన్ని ఆఫీస్ సూట్లలోనూ ఎక్కువగా వాడే ఆఫీస్ సూట్ "మైక్రొసాఫ్ట్ ఆఫీస్". మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌లొ వ్యాసాలు రాయటానికి వాడే సాఫ్ట్వేర్ని మైక్రొసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి మీరు ఒక వ్యాసాన్ని రాసి ఫైలులొ భద్రపరిస్తె ఆ ఫైల్ ను వర్డ్ డాక్యుమెన్ట్ అంటారు. వీటి పేరులొ సాదారణంగా చివరలొ .doc వుంటుంది. ఈ వ్యాసంలొ వర్డ్ డాక్యుమెన్ట్‌ల వల్ల మీకు వచ్చే నష్టాలు వటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు చర్చించ బడ్డాయి. మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌తొ తయారు చేసిన ఇతర ఫైళ్ళు ప్రెసెన్టెషన్లు (.ppt), స్ప్రెడ్‌షీట్లు (.xls) కూడా ఇదే విధంగా చూడవచ్చు.

వర్డ్ డాక్యుమెన్ట్‌ల వాల్ల వచ్చే నష్ఠాలు:

వర్డ్ డాక్యుమెన్ట్‌లు మీకు హానికరమవ్వటనికి ముఖ్యమైన కారణం అవి రహస్యమైన పద్దతిలో భద్రపరచి వుండటం. మీరు మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి దాచిన వ్యాసం ఏ పద్దతిలో దాచి వుందో మైక్రొసాఫ్ట్ వారికి తప్ప ఎవరికీ తెలియదు. మైక్రోసాఫ్ట్ వారు ఈ పద్దతిని వివరించటానికి నిరాకరించారు. దీనివల్ల మైక్రొసాఫ్ట్ వారు తయారు చేసిన సాఫ్ట్వేర్ తప్ప మరే సాఫ్ట్వేర్ ఈ వాసాన్ని చదవలేవు. కనుక మీ సమాచారం యొక్క భవిష్యత్తు అమెరికాలొ ఒక కంపెనీ ఐన మైక్రొసాఫ్ట్ వారిపై ఆధార పడివునట్టె.

గ్ను జీ.పి.ఎల్.

ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాము. ఫ్రీ సాఫ్ట్‌వేర్ వాడకం రోజు రోజుకి పెరుగుతోంది. దీని వాడకం వల్ల మనకు ఇతర సాఫ్ట్‌వేర్‌లో లేని ఎన్నొ హక్కులు మనకు వస్తాయి. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ప్రాదాన్యంగా గ్ను జి.పి.ఎల్. అనే లైసెంస్‌ నిబంధనల ప్రకారం లభిసుంది. గ్ను జి.పి.ఎల్. మనకు ఇచే హక్కులను తెలుకోవటం లాభదాయకంగా వుంటుంది. ఉదాహరణకు మీరు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ఎవరికైనా చట్టబద్దంగా కాపీలు చేసి అమ్మవచ్చు. పైగా మీ సాఫ్ట్‌వేర్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌గా విడుదల చెయాలని నిర్ణయించినప్పుడు గ్ను జి.పి.ఎల్.ను సులభంగా వాడుకోవచ్చు. మీరు గ్ను జి.పి.ఎల్. సాఫ్ట్‌వేర్‌ను వాడినప్పుడు, ఇతరులకు పంచినప్పుడు, దీనిని ఆధారంగా చేసుకొని మీరుక సాఫ్ట్‌వేర్ తయారు చేసినప్పుడు కొన్ని నిబంధనలకు కట్టుబడి వండాలి.

ఒక సాఫ్ట్‌వేర్ సృష్టికర్త మనకు తను తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను అమ్మినప్పుడు కానీ, ఉచితంగా ఇచ్చినప్పుడు కానీ ఆ సాఫ్ట్‌వేర్ యెక్క వాడకం‌ ఒక ఒప్పందానికి లొబడి ఉంటుంది. దీనినే లైసెన్స్ అంటారు. సాఫ్ట్‌వేర్‌ను ఎటువంటి ఉపయోగాలకు వడవచ్చు? ఇతరులకు కాపీలు తయారు చేసి ఇవ్వవచ్చా లేదా? సాఫ్ట్‌వేర్ను మార్చటానికి హక్కులు వున్నయ్యా లేదా? ఇటు వంటి విషయాలు విష్లేషిస్తుంది. గ్ను జనరల్ పబ్లిక్ లైసెన్స్ (గ్ను జి.పి.ఎల్.) కూడా ఒక సాఫ్ట్‌వేర్ లైసెన్స్. దినిని ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు రూపొందించారు. దిని రెండవ సంచికను 1991లో విడుదల చేసారు. ఇదే ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో వుంది.