- Log in to post comments

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన IT చట్టం 2008 లోని 66A అధికరణను సవరించాలని దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని Free software Movement of India ఇచ్చిన పిలుపుని అందుకొని గుంటూరు నగరంలో కూడా మానవహారం చేపట్టాలని సేచ్ఛ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్య వ్యక్తులు మరియు సంస్థలను ఆహ్వానిస్తుంది.
ఇటీవల భాలథాకరే మరణం సందర్భంగా బంద్ నిర్వహించడాని వ్యతిరేకిస్తూ facebook లో post చేసినందుకు మహరాష్టలోని పాల్గర్ జిల్లాలో యువతితో పాటు ఆ post ని ఇష్టపడుతున్నట్టు వ్యక్తీకరించినందుకు మరొక యువతిని కూడా IT చట్టం లోని 66A అధికరణ క్రింద అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మన రాజ్యంగంలోని 16వ అధికరణలోని మాట్లాడే హక్కుకు వ్యతిరేకంగా ఉన్నది.
ఇలాంటి సంఘటనలు గత క్రొద్ది నెలలగా దేశవ్యాప్తంగా చాలా సందర్భాలలొ చోటు చేసుకుంటున్నాయి. పశ్ఛిమబెంగాల్ ముఖ్యమంత్రి మీద వ్యంగ చిత్రం గీసి తన స్నేహితులతో పంచుకొన్నందుకు జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అసీమ్ త్రివేధి అనే కార్టూనిస్టుని కూడా ఈ చట్టం క్రింద అదెస్ట్ చేశారు. ఈ విధంగా IT చట్టంలోని 66వ అధికరణను తప్పుగా వాడుతున్నందున మనము ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామ అనే సందేహం తలెత్తుంది. అందువల్ల దీనిని సవరించాలని కోరుతూ సేచ్ఛ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టాలని నిర్ణయించింది..
ప్రజాస్వామ్య బద్దులు మరియు internet usersని మరియు విద్యార్దులను పాల్గొనాలని కోరుతున్నది.
స్థలం: మదర్ థెరీసా బొమ్మదగ్గర, హలివుడ్ - బాలివుడ్ సెంటర్, లక్ష్మిపురం. గుంటూరు.
సమయం: 2nd December, 2012. సాయంత్రం 4-30ని॥