ఫ్రీ సాఫ్ట్వేర్ ---పాఠశాల విద్య

Date

 
    నిత్యజీవితంలో కంప్యూటర్లు సెల్ ఫోన్లు ఇతర గాడ్జెట్లు  సగటు మనిషి జీవితంతో సైతం పెనవేసుకుపోతున్నాయి. కంప్యూటర్‌ లిటరేట్ అయి ఉండటం భావి తరాలవారికి ఒక కంపల్షన్‌గా మారింది. కంప్యుటర్ ఇంటర్నెట్ ఆవిష్కరణలు అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది పలికాయి. విజ్ఞాన సర్వస్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఎవరైనా అంటే అందరం అంగీకరిస్తాము, కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో  కాపీ రైటు పేటెంట్ల వంటి అంశాల ద్వారా  విజ్ఞానం బందీ అవుతున్న నేటి తరుణంలో అసలు సాధ్యమయ్యే అంశమేనా అని తప్పకుండా అనిపిస్తుంది. కులాసా రయుళ్ల మాటలో చెప్పాలంటే  "వెళ్ళెళ్ళవయ్యా మా చెప్పొచ్చావులే చోద్యం" అంటారు . అందులోను ఐటి అంటే అసలు నమ్మసక్యం కాదు . కానీ ఇటువంటి ఒక నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కూడా ఐటి రంగంలోనే. 
    అదే ఫ్రీ సాఫ్ట్వేర్, దీనిని స్ఫూర్తిగా తీసుకునే ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన సర్వస్వాన్ని ఇంటర్నెట్లో అందుబాటులోకి తీసుకువస్తున్న వికీ పీడియా కూడా ప్రారంభమైంది. మిమ్మల్నెవరయినా ఏమండీ ఫ్రీ సాఫ్ట్వేర్ ని మీరు వినియోగించారా అని అడిగితే నేను కంప్యూటర్ ను వాడతాను కనీ ఫ్రీ సాఫ్ట్వేర్ ని మాత్రం వాడలేదనే చెబుతారు. మీరు కానీ ఇంటర్నెట్ వాడినట్లయితే కచ్చితంగా ఫ్రీ సాఫ్ట్వేర్ వాడినట్లే. ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ సర్వర్లలో 85% ఫ్రీ సాఫ్ట్వేర్లమీద అధార పడి పనిచేస్తున్నాయి. ఇంకెక్కడ వాడుతున్నారో చెప్పాలంటే కొన్ని పుస్తాకలే ప్రచురించాల్సి రావచ్చు. మచ్చుకకు నాసాలో, మొన్న మన చంద్రయాన్ ప్రాజెక్టు మిషన్ కంట్ర్లొల్ సెంటర్లో, శాస్త్ర పరిసోధనల్లో స్కూలు విధ్యలో, లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో, జర్మనీ, ఫ్రాన్సు ప్రభుత్వ కార్యకలాపాలకి, స్కూలు విద్యకి.......మన దేశంలో చెప్పాలంటే, హైస్కూలు కంప్యూటర్ విద్యనందించటంలో  ప్రపంచానికే ఆదర్శంగా ఉండి ఈ మద్యనే అవార్డు వచ్చినది  కేరళ రాష్ట్రం . అక్కడ హైస్కూళ్ళన్నింటిలోనూ కేవలం ఫ్రీ సాఫ్ట్వేర్ మాత్రమే వాడుతున్నారు.
 
ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే:- 
    ఫ్రీ అనగానే ఉచితం అనే అర్ధం స్ఫురిస్తుంది, దానిని స్వతంత్ర అనే  అర్థంలో తీసుకోవాలి . ఇంగ్లీషులో  స్వతంత్ర అనే దానికి ఉచితం అనే అర్ధాని "ఫ్రీ" పర్యాయ పదంగా ఉంది . సాఫ్ట్వేర్ రెండు రకాల స్థితులలో ఉంటుంది, ఒకటి సోర్స్ కోడ్ కాగా రెండవది బైనరీ . సోర్స్ కోడ్ (మూల రూపకరణాలు) అంటే ప్రోగ్రామర్లు రాసేది, బైనరీ అంటే  కంప్యూటర్‌లో ఎక్సిక్యూట్ చేయటానికి ఒకటి సున్నాల రూపంలో ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రూలూ నట్లతో ఉన్న బండిని సోర్స్ కోడ్ అంటే, స్క్రూలూ నట్లూ లేకుండా వెల్డింగ్ చేసి యిచ్చిన బండిని బైనరీకి సమానం అనుకోవచ్చు. మనం ఎంత మంచి బండి అయినా సరే స్క్రూలు నట్లు లేనిదయితే కచ్చితంగా కొనము. మైక్రోసాఫ్ట్  వంటి కంపెనీలు మనకి అమ్ముతున్నది మాత్రం ఈ రకమైనవే. మనకి మెకానిక్ పని రాకపోయినా, మెకానిక్ వద్దకెళ్ళి రిపెయిర్ చేయించుకుంటాము , సాఫ్ట్వేర్ రంగంలో ఈ రకమైన గుత్తధిపత్యానిని నిరసిస్తూ source code తో కూడిన సాఫ్ట్వేర్ని అందించినది మాత్రమే ఫ్రీ సాఫ్ట్ వేర్ .సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం మూలంగా దీని అభివృద్ది వేగంగానూ అత్యంత నాణ్యంగానూ జరిగింది. వైరస్‌లు సైతం సోకలేని సాఫ్ట్   వేర్ ఇదంటే దీని నాణ్యతేమిటో మనకర్ధమవుతుంది. ఫ్రీ సాఫ్ట్వేర్ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా రమారమీ 20లక్షల మంది పని చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా సాగుతున్నది. ఫ్రీ సాఫ్ట్ వేర్ తో తయారయిన ఆపరేటింగ్ సిస్టం లు (మైక్రోసాఫ్ట్ విండోస్ వంటివి) షుమారు 400 వందల రకాలు వాడకంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగులో తయారయిన స్వేచ్ఛ కూడా ఈ కోవకు చెందిందే. సోర్స్ కోడ్ అందుబాటులో ఉండటాన ఇది ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడుతున్నది. మాతృభాషలో విద్యనభ్యసించటంతో ఎన్ని ఉపయోగాలున్నాయో, కంప్యూటర్ వెద్యను సైతం మాతృ భాషలో అభ్యసించటంలో అన్ని ఉపయోగాలుంటాయి.
 
ఫ్రీ సాఫ్ట్వేర్ నిర్వచనం:-
ఏ సాఫ్ట్  వేర్నయినా ఫ్రీ సాఫ్ట్వేర్ అనాలంటే అది నాలుగు సూత్రాలకు నిలబడాలి
౧. సాఫ్ట్ వేర్ని ఏ అవసరానికైనా స్వేచ్చగా వినియోగించుకునే హక్కుండాలి.
౨. దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ ఇచ్చి తీరాలి.
౩. దానిని అభివృద్ది చేసి ఇతరులకు రొక్కానికి గాని ఉచితంగా గానీ ఇచ్చే హక్కు ఉండాలి.
౪. జత చేసిన, మలచిన, అభివృద్ది చేసిన సాఫ్ట్ వేర్నికూడా ఫ్రీసాఫ్ట్ వేర్‌గా ఇవ్వాలి .
 
 
ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం 
ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మన దేశంలో కూడా అభివృద్ది అవుతున్నది. ఇంత పెద్దమొత్తంలో ప్రజలకందరికీ అందుబాటులోకి సాఫ్ట్ వేర్ని తీసుకు వచ్చింది ఏ ఒక్క కంపెనీ కాదు. ఇదంతా ఫ్రీ సాఫ్ట్ వేర్ ఉద్యమకారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సర్చ్ ఇంజన్ కూడా ఫ్రీ సాఫ్ట్ వేర్ని ఉపయోగించే  సేవలనందిస్తున్నది. మన రాష్ర్ట్రంలో కూడా తెలుగులోకి సాఫ్ట్ వేర్ని  అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ  ఉద్యమమే. వివిధ దేశాల్లో ఉన్న వారితో కలిపి షుమారు 1500 మంది వాలంటీర్ల కృషి దీనివెనక ఉంది.
 
కేరళ అనుభవం:- 
 
కేరలలో ఫ్రీ సాఫ్ట్ వేర్లతో నే కంప్యూటర్ విద్యా పాఠాలను నేర్పుతున్నారు. తొలుత మైక్రోసాఫ్ట్  సాఫ్ట్ వేర్లతో  పాఠాలు చెప్పేవారు. అక్కడి టీచర్ల సంఘమైన కేరళ స్కూల్ టీచర్స్   ఎసోసియేషన్ కృషి ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైంది. అక్కడ టీచర్లు ఫ్రీ సాఫ్ట్ వేర్లనధ్యయనం చేసి ఇతర టీచర్లకు తర్ఫీదిచ్చారు. పాఠశాలకి అవసరమయ్యే సాఫ్ట్ వేర్లతో కూడిన ఒక సి.డి ని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఉద్యమకారులు తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రక్రియని ఆపటానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేక ఎత్తుగడలేసింది. టీచర్లను ట్రెయిన్ చేసిన మాస్టర్ ట్రెయెనర్లకు    అమెరికా వెళ్ళే అవకాశంతో పాటు భారీ మొత్తంలో నగదు బహుమతులను కూడా ప్రకటించింది. వీటినన్నింటినీ తిరస్కరించి  ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టటంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది KSTA. నేడు కేరళలో 1,10,000 మంది టీచర్లు  తర్ఫీదు పొంది ఉన్నారు,మొత్తం 6000 స్కూళ్ళకు గానూ 4000 స్కూళ్ళలో 90000 కంప్యూటర్లున్నాయి . వీరు కేవలం కంప్యూటర్ విద్యనందిస్తున్నారనుకుంటే పొరపాటే, కంప్యూటర్ ఆధారిత విధ్యాబోధనా పద్దతులను ప్రారంభించారు. గణితంలో థేల్స్  థియరం కానీ, పైథాగరస్ థియరం కానీ ఏ థియరం అయినా దానిని demonstrate చేయటానికి సాఫ్ట్వేర్లున్నాయి. విశ్వాన్ని కంప్యూటర్లో చూపగల స్టెల్లారియం సాఫ్ట్ వేర్‌తో ఏకంగా మన పాల పుంతని, సౌర కుటుంబాన్ని, అంతరిక్షంలోని అన్ని నక్షత్రాలను, అఖరుకి సూర్యుని తర్వాత అతి సమీపంలో ఉన్న అల్ఫా సెంటౌరీ నక్షత్రాన్ని సైతం చూపగలరు. విద్యార్థులకు ఒక కొత్త ఒరవడిని, విజ్ఞాన్ని పంచుకునే సాంప్రదాయాన్ని నేర్పటమే కకుండా వీరు ఆదా చేసిన ప్రజల డబ్బు ను షుమారు 180 కోట్ల వరకు ఆదా చేయకలిగారు. ఒక సారి కంప్యూటర్ కొన్నాక దానిని ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకొకసారి ఇంత డబ్బును దుబారాకాకుండా చూస్తున్నారు.  బాధ్యతతో భావి తరం నిర్మించే టీచర్లము మేమే అనే సాంప్రదాయానికి ఆదర్శంగా నిలచి, జాతీయోద్యమంలోనే కాదు, సామాచార విప్లవంలో సైతం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం అంటూ నడిచింది   KSTA. వీరందిస్తున్న విద్య నాణ్యమైనది కావటంతో బ్రసీల్, వినిజూలా వంటి అనేక దేశాలు దీనిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రక్రియనంతా  [email protected] ద్వారా నడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు అవర్డులు సాధించింది [email protected]. నేషనల్ ఈ గవర్నేన్స్  అవార్డు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ODF అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. 
 
స్కూలు విద్య -- మన రాష్ట్రం:
 
ఈ సాఫ్ట్ వేర్లతో విద్యాబోధన చేయటం అంటే విద్యార్థులకు తమ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే ఒరవడిని నేర్పటం, మైక్రోసాఫ్ట్ వంటి గుత్త (proprietary) సాఫ్ట్ వేర్లు  నేర్పటమంటే ఇతరులతో విజ్ఞానాన్ని పంచుకోరాదనటం. మైక్రోసాఫ్ట్ వంటివి ఉచితంగా వచ్చినా పిల్లలకు ఉచితంగా సిగరేట్లు ఇవ్వటంలాంటిదే అంటారు ఈ ఉద్యమ ప్రారంభకులు రిచర్డ్ స్టాల్‌మాన్.
మన ప్రభుత్వం కూడా కంప్యూటర్ విధ్యను అందించే ఏర్పాటు చేసి దానిని విస్తరిస్తున్నది. దీనికొరకు కోట్ల రూపాయిలను కూడా వెచ్చిస్తున్నది. విధ్యనభ్యసించేటప్పుడు మాతృ భాషలో బోధన జరిగటానికి గల కారణాలే   కంప్యూటర్ విద్యనందించటానికి కూడా వర్తిస్తాయి .  
    మన రాష్ట్రంలో ఒక కంప్యూటర్‌ను కొనటానికయ్యే ఖర్చుతో సమాంతరంగా సాఫ్ట్వేర్ కొనటానికి కూడా ఖర్చు చేస్తున్నది, అంటే ప్రభుత్వ్య వ్యయంలో సగానికి సగం కేవలం సాఫ్ట్వేర్ కొనటానికి ఖర్చవుతున్నదేనిది స్పష్టం . వీటి నిర్వహణను NIIT వంటి  సంస్థలకు అప్పచెప్పి వాటికి డబ్బును చెల్లిస్తున్నది. అక్కడ టీచర్లుగా పని చేస్తున్న వారికి జీత బత్యాలు సైతం సరిగా ఇవ్వట్లేదు, ఇస్తున్నవి కూడా మరీ తక్కువగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వంటి  సాఫ్ట్ వేర్ల  స్థానంలో ఫ్రీ సాఫ్ట్ వేర్ల నుపయోగించి మంచి సాంప్రదాయానికి మన రాష్ట్రంలో సైతం శ్రీకారం చుడదాము. ఈ పద్దతిని అభివృద్ది చెందిన దేశాలైన జర్మనీ,ఫ్రాన్సు, అభివృద్ది చెందుతున్న దేశాలయిన బ్రసిల్, వెనిజూలా, చైనా ఇత్యాది దేశలు అమలు చేస్తున్నాయి. నిత్యం నిధుల కొరతతో సతమవుతున్న మన లాంటి దేశాలకు సైతం ఈ మార్గ మే మంచిది. సాఫ్ట్ వేర్ల కొరకు ఖర్చు చేస్తున్న  కోట్లాది రూపాయిల వ్యయాన్ని ఉపాధి కల్పనకు కంప్యుటర్ టీచర్ల జీత భత్యాలకొరకు ఖర్చు చేయాలి.
 
 
ఫ్రీ సాఫ్ట్ వేర్ గురించి మరిన్ని వివరాలకు www.swecha.orgలో చూడగలరు .
 
మనం వాడుకోవటానికి   అందుబాటులోని కొన్ని  ఫ్రీ సాఫ్ట్ వేర్లు : Open Office, Mozilla Firefox, Gimp, Pidgin, VLC media player, GCompris, ekiga .....