తెలుగు స్థానికీకరణ - స్వేచ్ఛ సాఫ్టువేరు
ఏమిటి?
Telugu Localisation = తెలుగు స్థానికీకరణ
- వివిధ ఉపకరణాల తెలుగీకరణకు తోడ్పడడం.
- కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ విషయమై జరిగే కృషికి ప్రచారం కల్పించడం.
Free(dom) Software = స్వేచ్ఛ సాఫ్టువేరు
ఏ సాఫ్టువేరుని అయినా స్వేచ్ఛ సాఫ్టువేరు అనాలంటే అది నాలుగు సూత్రాలకు కట్టుబడి ఉండాలి.
- సాఫ్టువేరుని ఏ అవసరానికైనా స్వేచ్చగా వినియోగించుకునే హక్కుండాలి.
- దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండాలి.
- దానిని అభివృద్ది చేసి ఇతరులకు అద్దెకు గాని ఉచితంగా గాని ఇచ్చే హక్కు ఉండాలి.
- జత చేసిన, మలచిన, అభివృద్ది చేసిన సాఫ్టువేరుని కూడా స్వేచ్ఛ సాఫ్టువేరుగా విడుదల చేయాలి.
ఎందుకు?
సాధారణ ప్రజలందరు తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలి. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకి చేరాలి అనే ధ్యేయంతో మనం కృషి చేయాలి. పై లక్ష్యసాధనను ఈ క్రింది అంచెలలో సాధించాలి.
- పరిచయం: కంప్యూటర్లలో తెలుగును చూడవచ్చు మరియు వ్రాయవచ్చని ప్రజలు తెలుసుకోవడం.
- ఆదరణ: అంతర్జాల అనుసంధానమున్న సామాన్య ప్రజలందరూ తమ ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే జరుపుకోవడం.
- వ్యాప్తి: సాధారణంగా ఉపయోగించే వెబ్‌సైట్లు మరియు కంప్యూటర్ ఉపకరణాలు తెలుగులో అందుబాటులోకి రావడం
- స్థిరత: రోజువారీగా వాడే సాఫ్టువేరు సాంకేతిక పదాలకు (అందరూ వాడుతుండడం వల్ల) ఓ స్థాయి ప్రామాణికత రావడం
- విజృంభణ: సగటు తెలుగువారికి అవసరమైన కంప్యూటర్ సంభాషణ అంతా తెలుగులోనే జరుగుతుంది. అన్ని రకాల వెబ్‌సైట్లూ, ఉపకరణాలూ తెలుగులో కూడా లభిస్తాయి.
ఎలా?
విభాగం | వివరణ | వనరులు |
---|---|---|
కంప్యూటర్‌లో తెలుగు టైపు చేయడం | ఈ రోజుల్లో తెలుగు చాలా సులువుగా టైపు చేయవచ్చు, అందుకు చాలా పరికరాలు/పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. | స్వేచ్ఛ ఇన్‌పుట్లేఖిని |
పదకోశం | పదకోశం | స్వేచ్ఛ పదకోశంతెలుగుపదం |
మొబైళ్ళలో తెలుగు టైపు చేయడం | . | ఇండిక్ కీబోర్డు |
ప్రాజెక్టులు | తెలుగు స్థానికరణ లక్ష్యం కోసం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి | స్వేచ్ఛ స్థానికీకరణ ప్రాజెక్టు |