ఆఫీస్ అవసరాలకు వాడే సాఫ్ట్వేర్ని ఆఫీస్ సూట్ అంటారు. ఒక సాదారణ ఆఫిస్ సూట్లొ వ్యాసాలు రాయవచ్చు, ప్రసెంటేషన్లు ఇవ్వవచ్చు, కంపెనీ ఖతాలు దాచటం వంటి పనులతొ పాటూ మరెన్నో పనులు కూడా చెయ్యవచ్చు. అన్ని ఆఫీస్ సూట్లలోనూ ఎక్కువగా వాడే ఆఫీస్ సూట్ "మైక్రొసాఫ్ట్ ఆఫీస్". మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌లొ వ్యాసాలు రాయటానికి వాడే సాఫ్ట్వేర్ని మైక్రొసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి మీరు ఒక వ్యాసాన్ని రాసి ఫైలులొ భద్రపరిస్తె ఆ ఫైల్ ను వర్డ్ డాక్యుమెన్ట్ అంటారు. వీటి పేరులొ సాదారణంగా చివరలొ .doc వుంటుంది. ఈ వ్యాసంలొ వర్డ్ డాక్యుమెన్ట్‌ల వల్ల మీకు వచ్చే నష్టాలు వటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు చర్చించ బడ్డాయి. మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌తొ తయారు చేసిన ఇతర ఫైళ్ళు ప్రెసెన్టెషన్లు (.ppt), స్ప్రెడ్‌షీట్లు (.xls) కూడా ఇదే విధంగా చూడవచ్చు.
వర్డ్ డాక్యుమెన్ట్‌ల వాల్ల వచ్చే నష్ఠాలు:
వర్డ్ డాక్యుమెన్ట్‌లు మీకు హానికరమవ్వటనికి ముఖ్యమైన కారణం అవి రహస్యమైన పద్దతిలో భద్రపరచి వుండటం. మీరు మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి దాచిన వ్యాసం ఏ పద్దతిలో దాచి వుందో మైక్రొసాఫ్ట్ వారికి తప్ప ఎవరికీ తెలియదు. మైక్రోసాఫ్ట్ వారు ఈ పద్దతిని వివరించటానికి నిరాకరించారు. దీనివల్ల మైక్రొసాఫ్ట్ వారు తయారు చేసిన సాఫ్ట్వేర్ తప్ప మరే సాఫ్ట్వేర్ ఈ వాసాన్ని చదవలేవు. కనుక మీ సమాచారం యొక్క భవిష్యత్తు అమెరికాలొ ఒక కంపెనీ ఐన మైక్రొసాఫ్ట్ వారిపై ఆధార పడివునట్టె.